Sudhaa Chandran: సుధా చంద్రన్‌ ఆవేదన.. క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్

22 Oct, 2021 19:06 IST|Sakshi

సుధా చంద్రన్‌.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ప్రముఖ నాట్యకారణి అయిన సుధా చంద్రన్‌ ఓ ప్రమాదంలో తన కాలును కోల్పోగా కృత్రియ కాలును అమర్చుకున్నారు. కృత్రిమ కాలుతో కూడా తన నాట్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల సుధ చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రతిసారి తన కృత్రిమ కాలును తొలగించమని అడుగుతునట్లు సుధా చంద్రన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’

తాజాగా సుధాచంద్రన్ పట్ల ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రవర్తించి తీరుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌లో సుధాచంద్రన్‌కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్‌ ప్రకారం విమనాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో కొన్ని అసాధారణ పరిస్థితులలో మాత్రమే కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా తమ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది. 
చదవండి: వైరల్‌: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..

ఇదిలా ఉండగా.. సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. నేను ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ.  మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు