సుప్రీంకోర్టుకు జనవరి 1 వరకు శీతాకాల సెలవులు

17 Dec, 2022 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్‌ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం.

ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు