Dharamshala Floods: ఉప్పెనలా వరదలు.. నీటమునిగిన ధర్మశాల

12 Jul, 2021 12:39 IST|Sakshi

Dharamshala Cloud Burst కమ్ముకున్న నల్ల మేఘాలు, ఆ వెంటనే భారీ వర్షాలు.. హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో. ముఖ్యంగా భాగ్సు నాగ్‌ ఏరియాలో వరదల్లో చిక్కుకుపోయిన వందల మంది సాయం కోసం కేకలు వేస్తున్నారు. 

సిమ్లా: కుంభవృష్టితో ధర్మశాల నీట మునిగింది. సోమవారం ఉదయం వరకు మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కొండలపై నుంచి నీళ్లు.. భాగ్‌సునాగ్‌ నాలా ఉప్పొంగడంతో ధర్మశాలలోకి నీరు చొచ్చుకువచ్చింది. బురద నీటి ప్రవాహం, కార్లు కొట్టుకుపోవడం, కట్టలు తెగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆ వీడియోలు అక్కడి ప్రజల నిస్సహయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్‌ మీడియాలోనే వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతోనూ వరదలు మరింత పొటేత్తాయి.

లాక్‌డౌన్‌ తర్వాత ఆంక్షలు సడలించడం, పైగా వారాంతం కావడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఊడిపడ్డ వరదల్లో వాళ్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కురవడం, వరద ఉధృతి పెరుగుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని ధర్మశాల అధికారులు చెప్తున్నారు. 

మరిన్ని వార్తలు