Tokyo Olympics 2020: ‘మణి’పూస చానుకు భారీ నజారానా

25 Jul, 2021 10:22 IST|Sakshi

ఇంఫాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్‌ భారీ నజారానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు బహుమతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ శనివారం ప్రకటించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. చివరకు రజత పతకం సాధించి రెండో స్థానంలో నిలిచింది.

ఆమె విజయంతో భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె సొంత రాష్ట్రం మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ చానును అభినందించారు. అంతకుముందు బిరేన్‌ సింగ్‌ విజేతగా నిలిచిన మీరాబాయి చానుతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అద్భుతంగా పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు