జార్ఖండ్‌ సీఎంకు పదవి గండం.. హేమంత్‌ సోరేన్‌కు బిగ్‌ షాక్‌!

25 Aug, 2022 13:38 IST|Sakshi

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌  సోరేన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీ కారణంగా పొలిటికల్‌గా సీఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆయన సీఎం పదవికే గండం ఏర్పడింది. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్‌పై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముంది.

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ సీఎంగా ఉన్న హేమంత్‌ సోరేన్.. మైనింగ్​ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. దీనిపై గవర్నర్ రమేష్‌ బైస్కు.. ఈసీ అభిప్రాయం కోరారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని  కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టు సమాచారం. కాగా, ఈసీ నివేదిక ఆధారంగా అతి త్వరలోనే సీఎం సోరేన్‌పై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముంది. 

మరిన్ని వార్తలు