దేశం సురక్షితంగా ఉందంటే.. వాళ్లే కారణం, బీహారీలకు సాయం అందాల్సిందే!.. కేసీఆర్‌కు నితీశ్‌​ కుమార్‌ కృతజ్ఞతలు

31 Aug, 2022 15:25 IST|Sakshi

సాక్షి, పాట్నా:  వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదని, బీహార్‌ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. బుధవారం బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగిన చెక్‌ పంపిణీల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

‘‘దేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. అక్కడి గోదావరి తీరం నుంచి గంగా నది తీరానికి రావడం ఆనందంగా ఉంది. బీహార్‌ నుంచి లక్షల మంది కూలీలు తెలంగాణకు వలస వస్తుంటారు. కానీ, కరోనా సమయంలో వలస కార్మికుల్ని కేంద్రం ఇబ్బంది పెట్టింది. మేం మాత్రం కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. అలాగే దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అందుకే అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.’’ అని సీఎం కేసీఆర్‌​ ప్రకటించారు.
 
అనంతరం బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన గొప్పదని, అందుకు కేసీఆర్‌కు అభినందనలని పేర్కొన్నారు. కరోనా సమయంలో కార్మికుల కోసం తెలంగాణ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని సీఎం నితీశ్‌ గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: ‘ఆప్‌ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’

మరిన్ని వార్తలు