స్పీడ్‌ పెంచిన గులాబీ బాస్‌.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం!

15 Dec, 2022 01:04 IST|Sakshi

జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ 

తొలుత రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్‌ దంపతులు 

తర్వాత మధ్యాహ్నం 12.37 గంటలకు బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ 

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తొలి సంతకం చేసిన కేసీఆర్‌

ఢిల్లీలో ఉమ్మడి కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు 

భావ సారూప్య పారీ్టలతో త్వరలోనే 

ఢిల్లీ వేదికగా కీలక సమావేశం 

రైతు పోరాటాలే బీఆర్‌ఎస్‌ తొలి ఎజెండా

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ సమగ్రతను దెబ్బతీసేలా, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీపై ఉమ్మడి పోరు సాగించాలని పలు పారీ్టల నేతలు, రైతు సంఘాల నాయకులకు బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కలిసి నడిచేందుకు ముందుకొచి్చన పార్టీలతోపాటు భవిష్యత్తులో మద్దతుగా నిలిచే ఇతర భావసారూప్య పారీ్టలను, సంఘాలను కలుపుకొని జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్మిద్దామని పేర్కొన్నారు.

బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్, జాతీయ కిసాన్‌నేత గుర్నామ్‌సింగ్‌తోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్‌ విడివిడిగా భేటీ అయ్యారు. కార్యాలయ ప్రారంభానికి ముందు, ఆ తర్వాత తుగ్లక్‌రోడ్‌లోని నివాసంలో వివిధ జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

రైతు ఉద్యమాలే తొలి అజెండా 
పార్టీ జాతీయ నినాదమైన ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ దిశగా బీఆర్‌ఎస్‌ తొలి అడుగులు ఉంటాయని.. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్నే తొలి ఎజెండాగా తీసుకుందామని భేటీల్లో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచేలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతు ఉద్యమాన్ని నిర్మించే అంశంపై కీలక చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ అంశంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పారీ్టలు, సంఘాలతో ఉమ్మడిగా పోరాడేందుకు తాము సిద్ధమని.. పార్లమెంట్‌ లోపల, బయట కూడా పోరాటాలు చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇక ధాన్యం సేకరణలో జాతీయ విధానం అవసరమని, దేశవ్యాప్తంగా సంక్షోభంలో పడిన వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం కోసం ఒత్తిడి చేస్తామని చెప్పినట్టు సమాచారం. 

ఢిల్లీలో సమావేశం పెట్టుకుందాం! 
దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు, వడ్డీలేని రుణాలు, పంటల బీమా పథకాల అమలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టవద్దనే అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఢిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని భేటీలలో ప్రతిపాదన వచి్చనట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఆరి్ధక ఆంక్షలు విధించి, కట్టడి చేయాలని చూడటం.. ప్రభుత్వాల్లో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పారీ్టల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను ఎండగట్టాల్సి ఉందనే అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. కేంద్ర సంస్థల దురి్వనియోగంపై ఉమ్మడి పోరాట కార్యాచరణ తీసుకుంటే తప్ప దానిని ఎదుర్కోలేమని భావన వచి్చనట్టు తెలిసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మతపర అంశాలను ఎగదోస్తూ బీజేపీ పబ్బం గడుపుకొంటోందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మొత్తంగా అంశాల వారీగా బీజేపీ తీరును ఎండగట్టాలని, కార్పోరేట్లకు పెద్దపీట వేసే తీరుపై గళమెత్తితేనే దేశంలో గుణాత్మక మార్పు సంభవిస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. 

మరో మూడు రోజులు ఇక్కడే.. 
సీఎం కేసీఆర్‌ మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయస్థాయి అంశాలపై వివిధ పారీ్టల నేతలు, మేధావులు, రైతు సంఘాల నేతలతో ఆయన చర్చలు జరపనున్నారని.. జాతీయ మీడియాను దృష్టిలో పెట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు