Covid Strain: కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై సింగపూర్‌ అభ్యంతరం

20 May, 2021 07:16 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్నారుల్లో కరోనా వైరస్‌ ‘సింగపూర్‌’ వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తోందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానిం చడంపై సింగపూర్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు సింగపూర్‌లోని భారత దౌత్యవేత్తను పిలిపించి తమ అభ్యంతరాన్ని వ్యక్త పరిచింది. భారత్‌-సింగపూర్‌ దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ రంగంలోకి దిగారు.

ఒక రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు భారతదేశ అభిప్రాయంగా భావించకూడదని జై శంకర్‌ వివరణ ఇచ్చారు. ‘కేజ్రీవాల్‌.. కరోనా వేరియంట్ల వంటి వైద్య సంబంధ అంశాలపై భారత్‌ తరఫున అధికారికంగా మాట్లాడే వ్యక్తికాదు’ అని జై శంకర్‌ చెప్పారు.
చదవండి: 1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం

మరిన్ని వార్తలు