మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్‌ : ఢిల్లీ సీఎం

18 Mar, 2021 17:13 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంటే, మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.  ఈనేపథ్యంలో ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రానికి కీలక  విజ్ఞప్తి చేశారు. అందరికీ టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన  టీకాల సరఫరా తమకు లభిస్తే  తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఢిల్లీలో టీకాల కార్యక్రమం  మొత్తాన్ని పూర్తి  చేస్తామన్నారు.

కోవిడ్ -19 టీకాల  వేగాన్ని పెంచాలని  ఢిల్లీ  సర్కార్‌ పెంచాలని యోచిస్తోంది.  రోజుకు 30-40వేల  వ్యాక్సిన్లు  ఇస్తున్నామనీ,  దీన్ని త్వరలో 1.25 లక్షల మందికి పెంచుతామని కేజ్రీవాల్‌ తెలిపారు..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని అర్హతగల లబ్ధిదారులందరికీ టీకా డ్రైవ్‌ను విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగింది, కాబట్టి  టీకాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరించాలన్నారు. అంతేకాదు టీకా తీసుకునేందుకు అర్హుల జాబితా తయారుచేసే బదులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అలాగే టీకా ధరలు,  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వికేంద్రీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాలు తమదైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడానికి అనుమతించాలని ఢిల్లీ సీఎం కోరారు. టీకా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉన్నాయని అభి ప్రాయపడిన ఆయన దీ న్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు  చేయాలన్నారు. టీకా విషయంలో 2 నెలల అనుభవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

కాగా భారతదేశంలో మళ్లీ కోవిడ్‌-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35,871 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది 3 నెలల్లో అత్యధికమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 500కి పైగా కేసులు కొత్తగా నమోదుతో మొత్తం సంఖ్య 644,489 కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక మరణంతో  మరణించిన వారి సంఖ్య 10,945 గా ఉంది.

మరిన్ని వార్తలు