-

విచారణకు సిట్‌ ఏర్పాటు

17 Aug, 2020 19:19 IST|Sakshi

బాధ్యులపై కఠిన చర్యలు : యడియూరప్ప

బెంగళూరు: ​సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేనల్లుడు చేసిన పోస్ట్‌తో గతవారం బెంగళూర్‌లో జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ చేపట్టనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సోమవారం వెల్లడించారు. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్లెయిమ్‌ కమిషనర్‌ నియామకం కోసం ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును సంప్రదిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో గతవారం చెలరేగిన అల్లర్లలో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసుల సత్వర విచారణకు ముగ్గురు ప్రత్యేక ప్రాసికూటర్లను నియమిస్తామని యడియూరప్ప పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే గూండా యాక్ట్‌ను సిట్‌ ప్రయోగిస్తుందని యడియూరప్ప ట్వీట్‌ చేశారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలను బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో పాటు పలువురు సీనియర్‌ అధికారులతో సమావేశమైన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాలు వెల్లడించింది.
బెంగళూర్‌ అల్లర్లు: ఎమ్మెల్యే భావోద్వేగం

మరిన్ని వార్తలు