దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం

19 Sep, 2020 12:35 IST|Sakshi

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మిస్తామని ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌క‌టించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థ‌లాన్ని చూసి ప్ర‌ణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్‌పట్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలతో కూడిన మీరట్ డివిజన్ అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం స‌మీక్షించారు. అంతేకాకుండా నోయిడా కన్వెన్షన్ అండ్ హాబిటాట్ సెంటర్, గోల్ఫ్ కోర్సు , మెట్రో విస్తరణ, షూటింగ్ రేంజ్ వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. (నిరుద్యోగులకు ఆదిత్యనాథ్‌ బంపర్‌ ఆఫర్‌..)

మొత్తంగా గౌతమబుద్ధనగర్‌లో ప్ర‌స్తుతం ఏడు ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. మీరట్‌లోని రింగ్ రోడ్ వ‌ద్ద మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్‌ను సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టును  సైతం 2025 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి ప‌నుల్లో జాప్యం స‌హించ‌మ‌ని, నాణ్య‌తా ప్ర‌మాణాల‌కు క‌ట్టుబ‌డి స‌కాలంలో ప్రాజెక్టు ప‌నులు పూర్తిచేయాల‌ని సీఎం యోగి పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం చేస్తూ అక్ర‌మాల‌కు పాల్ప‌డితే దోషుల ఆస్తులు స్వాధీనం చేసుకోవ‌డంతోపాటు క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆదిత్యనాథ్‌ హెచ్చ‌రించారు.  (పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లివ్వాలి)

మరిన్ని వార్తలు