సీఎం యోగిని హత్య చేస్తానంటూ బెదిరింపులు.. లక్నో వ్యక్తి అరెస్ట్‌

25 Apr, 2023 10:10 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని ట్రేస్‌ చేసి అరెస్ట్‌ చేశారు. 

లక్నోకు చెందిన ఓ వ్యక్తి యూపీ ఎమర్జెన్సీ నెంబర్‌ 112కి మెసేజ్‌ చేశాడు. సీఎం యోగిని త్వరలో చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నాడు. దీంతో 112 ఆపరేషన్‌ కమాండర్‌ విషయాన్ని సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్‌ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కేరళ పర్యటన వేళ ఆయన ఆత్మాహుతి బాంబు దాడిలో చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపింది. కొచ్చికి చెందిన జేవియర్ అనే వ్యక్తి ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్‌ సురేంద్రన్‌కు లేఖ పంపాగా.. ఆయన దానిని పోలీసులకు అందజేశారు. అయితే వారం తర్వాత ఆ లేఖ గురించి మీడియాకు సమాచారం పొక్కింది. దీంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టారంటూ బీజేపీ, కేరళ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రధాని కేరళ రెండో రోజుల పర్యటన కోసం భారీగా పోలీసులను మోహరించారు.

మరిన్ని వార్తలు