-

దటీజ్‌ సీఎం యోగి.. అమర జవాన్ల కుటుంబాలకు భారీ సాయం!

24 Dec, 2022 19:34 IST|Sakshi

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, జవాన్‌లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు జవాన్లు గాయపడ్డారు. 

అయితే, రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో యూపీకి చెందిన నలుగురు జవాన్లు ఉన్నారు. దీంతో, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. కాగా, ప్రమాదంలో చనిపోయిన నలుగురు జవాన్ల కుటుంబాటకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాట్టు సీఎం యోగి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

అలాగే, నలుగురు జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు యూపీ సీఎంవో నుంచి లేఖను విడుదల చేశారు. దీంతో, సీఎం యోగి నిర్ణయంపై జవాన్ల కుటుంబాలతో పాటుగా యూపీ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సిక్కింలో జరిగిన ప్రమాదం మృతుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13 మంది సైనికులు ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు