పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. ఎలా తప్పించుకుందంటే?

28 Aug, 2022 13:08 IST|Sakshi

బెంగళూరు: పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఆమెపైకి ఎక్కిన నాగుపాము పడగవిప్పి కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్‌ గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలను స్థానికుడు ఒకరు ఫోన్‌లో రికార్డ్  చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారాయి.

పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెపై మహిళ నిద్రపోగా.. నాగుపాము ఆమెపైకి ఎక్కి పడగవిప్పింది. పాము కదలికలతో మేల్కొన్న మహిళ పడగవిప్పిన నాగును చూసి.. కదలకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రమాదం నుంచి కాపాడు దేవుడా అంటూ వేడుకుంది. కొద్దిసేపు అలాగే పడగవిప్పుకొని ఉన్న పాము మహిళకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది.

ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్‌.. అధికారులే షాక్‌!

మరిన్ని వార్తలు