వైరల్‌ వీడియో: మరో కమల్‌ హాసన్‌.. నటనకు నెటిజన్లు ఫిదా!

15 Jul, 2021 16:54 IST|Sakshi

Reporting Spoof Video: కరోనా మనిషికి ఎన్నో విషయాలను నేర్పించింది. ఇంటి పట్టునే కూర్చో పెట్టింది. వాస్తవానికి పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలు తమ తరగతులను ఆన్‌లైన్‌లో వింటున్నారు. కానీ చాలా మంది పిల్లలు తమ ఇళ్లలో ఖైదు అయిపోయారు. వారి జీవితాలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌లకు పరిమితం అయిపోయాయి. స్నేహితులను కలవలేరు.. ఆట స్థలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇదంతా ఒక పార్శ్వం. దీనికి మరో పార్శ్వం తమ సమయాన్ని సద్వినియోగం చేకుకోవడం.

చెన్నై: కోయంబత్తూరుకు చెందిన అసేవెన్‌ అనే బాలుడు న్యూస్‌  రిపోర్టేజ్ గురించి చేసిన స్పూఫ్ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుంతోంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారం రోజుల్లోనే 5.79 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. వివరాల్లోకి వెళితే.. రీతూ చిన్నప్పటి నుంచే దేన్నైనా చూసి ఇట్టే చేసేవాడు. దాన్ని చూసి తండ్రికి ఆశ్యర్యపోయాడు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో రీతూ  న్యూస్‌ క్లిప్‌లను ఎక్కువగా చూసేవాడు.

దీంతో కొడుకు వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడానికి ఇది వరకే ప్రారంభించిన ఛానల్‌లో ఈ  స్పూఫ్ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో రీతూ యాంకర్‌గా, ఫీల్డ్‌ రిపోర్టర్‌గా, రైతుగా, సామాన్య వ్యక్తిగా నటించి నెటిజనుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘రీతూ నీ నటన సూపర్‌ ఉంది. ఇంతలోనే అన్ని అవతారాలా!’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మరో నెటిజన్‌ ‘‘ చోటా  కమల్‌ హాసన్‌ నటన అదిరిపోయింది. బొమ్మ పడితే బ్లాక్‌ బస్టర్‌.’’ అంటూ కామెంట్‌ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు