ఈ కాలేజీలో అన్నీ అక్రమాలే.. వీడియో తీసి విద్యార్థిని...

6 Sep, 2022 11:36 IST|Sakshi

మైసూరు: మైసూరు నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల్లో చదువుకుంటున్న విద్యార్థిని ఒకరు చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనకు ముందు ఆమె ఒక వీడియో రికార్డు చేసి అందులో తన ఆత్మహత్యకు కళాశాల ప్రిన్సిపాల్‌, సిబ్బంది కారణమని తెలిపింది. తనకు కళాశాల్లో ప్రతి రోజూ ఇబ్బంది ఎదురవుతోందని, విద్యార్థుల పట్ల తారతమ్యం చూపిస్తున్నారని, రోజూ క్లాసులకు వెళ్తున్నా కూడా గైర్హాజరు వేస్తున్నారని వీడియోలో వాపోయింది.

హాల్‌ టికెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని తెలిపింది. ఫీజులు కట్టినదానికి రసీదులు ఇవ్వడం లేదని, హాల్‌ టికెట్‌ సమస్యపై ప్రిన్సిపాల్‌ వద్ద ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. విద్యార్థిని చెయ్యి కోసుకుని, నిద్ర మాత్రలు మింగగా, కొందరు గమనించి ఆస్పత్రిలో చేర్చారు. జయలక్ష్మి పురం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

చదవండి: (బెంగళూరు అతలాకుతలం)

మరిన్ని వార్తలు