రామమందిర భూమిపూజ‌.. అస్సాంలో అల్ల‌ర్లు

6 Aug, 2020 10:34 IST|Sakshi

గువాహటి : అయోధ్యలో ప్ర‌తిష్టాత్మ‌క రామ‌మందిరం భూమి పూజ కార్య‌క్ర‌మ వేడుక‌ల సంద‌ర్భంగా అస్సాంలో రెండు గ్రూపుల మ‌ధ్య అల్ల‌ర్లు చెల‌రేగ‌డంతో కర్ఫ్యూ విధించారు. సోనిత్‌పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. ఈ అల్లర్ల సందర్భంగా దుండగులు ఓ కారు, మూడు మోటారు సైకిళ్లను దహనం చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు.

గువాహ‌టిలోని పలు ప్రాంతాల్లో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. న‌లుగురి కంటే ఎవ‌రూ గుమికూడ‌రాద‌ని అధికారులు పేర్కొన్నారు. రామ‌మందిర శంకుస్థాప‌న నేప‌థ్యంలో అస్సాంలోని ప‌లు ప్రాంతాల్లో శాంతి భ‌ద్ర‌త స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌టంతో అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సంబంధిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లెవ‌రూ ర్యాలీలు చేయ‌రాద‌ని హెచ్చ‌రించారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన)

మరిన్ని వార్తలు