తమిళ గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్‌బీఐ సిబ్బందిపై కేసు నమోదు

27 Jan, 2022 14:56 IST|Sakshi

చెన్నై: మ‌న దేశంలోనే తమిళనాడు రాష్ట్రానికి  ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంది. దేశంలోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల కంటే.. త‌మిళులు చాలా భిన్న‌మైన వాళ్లు. స‌మ‌స్య వ‌స్తే.. అంద‌రూ ఒకే తాటిపైకి వ‌చ్చి స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తారు. ముఖ్యంగా త‌మిళ‌నాడు ప‌ద్ధ‌తులు, సంస్కృతుల ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు చాలా సీరియ‌స్‌గా ఉంటారు. అయితే  తాజాగా మ‌రోసారి త‌మిళ వాసుల‌కు కోపం వ‌చ్చింది. బుధవారం  దేశ వ్యాప్తంగా 73వ రిప‌బ్లిక్ వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రీయ గీతం తమిళ్‌తాయ్‌ వాళ్తు ఆల‌పిస్తారు. అచ్చం మ‌నం జాతీయ గీతం పాడేట‌ప్పుడు ఎలాగ నిల‌బ‌డ‌తామో... వారు కూడా అలాగే నిల‌బ‌డి త‌మిళ గీతాన్ని ఆల‌పిస్తారు.

కానీ నిన్న త‌మిళ గీతం పాడేట‌ప్పుడు మాత్రం..​​ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు లేచి నిల‌బ‌డ‌లేదు. ఈ సంఘ‌ట‌న త‌మిళ నాడు ఆర్‌బీఐ  కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘ‌ట‌న రాష్ట్రంలో వివాదస్పదంగా మారింది. అంతేకాదు.. రాష్ట్రీయ గీతం పాడేట‌ప్పుడు నిల‌బ‌డ‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల పై హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మ‌ద్రాసు కోర్టు పిటీష‌న్ కూడా దాఖ‌లు చేశారు.
చదవండి: కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే

ఇక ఈ కేసుపై విచార‌ణ చేసిన‌ కోర్టు.. త‌మిళ గీతం పాడేట‌ప్పుడు ఆ అధికారులు నిల‌బ‌డటం ఏ మాత్రం త‌ప్పు కాదని పేర్కొంది. వారికి ఈ రూల్స్ తేలియ‌ద‌ని మేం అనుకుంటున్నామని, దీనిపై ఇంత రాద్ధాంతం అవ‌స‌రం లేదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే అటు కోర్టు తీర్పును రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటీఆర్‌ త్యాగరాజన్‌, ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌లు ఖండించారు. అంతేకాదు ఆర్‌బీఐ కార్యాలయ ముట్టడికి తమిళ సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్‌బీఐ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు.
చదవండి: Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!

మరిన్ని వార్తలు