డీలర్లు ఉచిత రేషన్ ఇవ్వకపోతే ఇలా చేయండి?

5 May, 2021 19:33 IST|Sakshi

హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లు విధించాయి. ఈ లాక్ డౌన్ వల్ల పని దొరక్క పేద ప్రజలు ఆకలితో అలమటించి పోతుంటే వీరిని దృష్టిలో పెట్టుకొని మే, జూన్ నెలల్లో పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన్ మంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం చేకూరనుంది. అయితే, కొందరు రేషన్ డీలర్లు ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు అందకుండా అడ్డుకుంటున్నారు. 

ఒకవేల మీ గ్రామంలో గనుక రేషన్ కార్డు ఉన్న రేషన్ డీలర్లు మీ కోటా ఆహార ధాన్యాలను అందించడానికి నిరాకరిస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)లో దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందించారు. మీరు డీలర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మెయిల్ చేసే సదుపాయం కూడా ఉంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ వెబ్‌సైట్(https://nfsa.gov.in)కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, ఇతర సహాయం కోసం వారిని సంప్రదించవచ్చు. పోర్టల్ ఓపెన్ చేశాక కుడి భాగంలో ఆన్లైన్ కంప్లయింట్ కింద ఉన్న హెల్ప్‌లైన్ టెలీఫోన్ నంబర్స్ క్లిక్ మీద చేసి మీ రాష్ట్రానికీ చెందిన నంబర్లు తెలుసుకోవచ్చు. 

హెల్ప్‌లైన్ నంబర్లు:
ఆంధ్రప్రదేశ్ : 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967.
తెలంగాణ : 04023310462, 180042500333, 1967.

చదవండి:

ఆన్‌లైన్‌లో బాల్ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మరిన్ని వార్తలు