‘భావ వ్యక్తీకరణ’ను అడ్డుకోవడమే: కాంగ్రెస్‌

10 Aug, 2021 04:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసి, ఒక ట్వీట్‌ను తొలగించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ట్విట్టర్‌ సంస్థ హరించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. మోదీ సర్కార్‌ ఆదేశాలకు తలొగ్గి ట్విట్టర్‌ సంస్థ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్విట్టర్‌ వైఖరిని మరింతగా ఎండగట్టేందుకు సిద్ధంకావాలని పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో నేతలు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు