పాపం కాంగ్రెస్‌.. గుజరాత్‌లో కోలుకోలేని దెబ్బ! ఏకంగా..

8 Dec, 2022 10:58 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభంజనం ధాటికి.. ప్రభావం చూపెడుతుందనుకున్న ఆప్‌.. సింగిల్‌ డిజిట్‌ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.  ఇక ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ పడింది కాంగ్రెస్‌ పార్టీకే. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏకంగా 60 దాకా సిట్టింగ్‌ స్థానాలకు కోల్పోయింది ఆ పార్టీ. కాంగ్రెస్‌ ఓట్లను ఆప్‌, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాసి ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్‌కు మరో మైనస్‌గా మారాయి.

2017 ఎన్నికల్లో  యూపీఏ కూటమికి 80 సీట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్‌ 77 సీట్లు సాధించింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. తాజా ట్రెండ్స్‌ చూస్తుంటే పాతిక సీట్లు లోపే కాంగ్రెస్‌ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు