రాఫెల్ ఒప్పందంపై మళ్లీ మొదలైన రగడ..

3 Jul, 2021 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ద విమానాలపై రగడ మళ్లీ మొదలైంది. రాఫెల్ ఒప్పందంపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 59 వేల కోట్ల  విలువైన  36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2106లో  భారత్‌–ఫ్రాన్స్‌ ఒప్పందం మధ్య కుదిరింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి బాహాటంగా బయటపడిందన్నారు. రిలయన్స్-డసాల్ట్ డీల్‌లో అన్ని సాక్ష్యాధారాలను ఫ్రెంచ్ వెబ్‌సైట్ ‘మీడియాపార్ట్’ బయటపెట్టిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. 

 తాజా నివేదికల ఆధారంగా  ఫ్రాన్స్ జాతీయ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించినట్లు మీడియాపార్ట్ తెలిపింది. ఇన్‌ఫ్రా, డసాల్ట్ ఏవియేషన్ కలిసి డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయని, దీనికి సంబంధించిన ఒప్పందం వివరాలన్నిటినీ ఈ వెబ్‌సైట్ వెల్లడించిందని తెలిపారు. ఈ అంశాలను అప్పటి ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయీస్ హొల్లాండ్ స్టేట్‌మెంట్ బలపరుస్తోందని తెలిపారు. డసాల్ట్ ఇండస్ట్రియల్ పార్టనర్‌గా రిలయన్స్‌ను నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుందని హొల్లాండ్ చెప్పారన్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు ఎటువంటి అవకాశం లేదని చెప్పారన్నారు.
 

మరిన్ని వార్తలు