‘మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తున్నారు’

23 Jul, 2020 17:05 IST|Sakshi

న్యూఢిలీ​: కాంగ్రెస్‌ పార్టీ మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి విమర్శించారు. ఉమాభారతి గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1984లో జరిగిన సిక్కుల మారణకాండలో కాంగ్రెస్‌ పాత్ర ఉందని ఆరోపించింది. అయితే కాంగ్రెస్‌ చెబుతున్నట్లు సెక్యూలరిజమ్ వల్ల దేశంలో ఎలాంటి ఉపాధి కల్పన జరగలేదని తెలిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అయోద్య పర్యటనను రాజకీయం చేయడం తగదని, ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆర్టికల్‌ 370పై సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, అయితే కాంగ్రెస్‌ పార్టీకి దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల శివసేన అధినేత శరద్‌ పవార్‌ మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. దేవాలయాలు కట్టినంత మాత్రాన కరోనా నియంత్రణ కాదని మోదీని ఉద్దేశించి పవార్‌ విమర్శించిన విషయం తెలిసిందే. (చదవండి: యువ నేతలను రాహుల్‌ ఎదగనీయడం లేదు: ఉమా భారతి)

మరిన్ని వార్తలు