'రాష్ర్టానికి సొంతంగా మ‌తం ఉండ‌దు క‌దా'?

15 Oct, 2020 16:25 IST|Sakshi

ల‌క్నో :  కుంభ‌మేళా నిర్వాహ‌ణ‌కు ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌డం స‌రైంది కాద‌ని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ  ఉదిత్ రాజ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. యూపీ ప్ర‌భుత్వం కుంభ‌మేళా పేరిట అల‌హాబాద్‌లో 4200 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. రాష్ర్టానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండ‌ద‌ని, అలాంట‌ప్పుడు మ‌త ప్రచారాలు, బోధ‌న‌ల‌కు ప్ర‌భుత్వ నిధులు ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.  ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కులు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. కోట్లాది మంది ప్ర‌జ‌లు ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ప్ప‌డు వారికి మౌలిక స‌దుపాయ‌లు ఏర్పాటుచేసే బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. (లవ్‌ జిహాద్‌: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం)

కొంత‌మంది వ్య‌క్తుల ప్ర‌యోజ‌నాలు కోస‌మే ప్ర‌భుత్వం ప‌నిచేయ‌ద‌ని, కుంభ‌మేళా అన్న‌ది కోట్లాది ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల క‌నీస సౌక‌ర్యాలను ఏర్పాటు చేసే బాధ్య‌త  ప్ర‌భుత్వానికి ఉంద‌ని పేర్కొన్నారు. ఇదే అంశంపై యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ మాట్లాడుతూ.. కుంభ‌మేళా అన్న‌ది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మాత్ర‌మే ప‌రిమితం కాలేద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మంపై అనుచిత వ్యాఖ్య‌లు స‌రికాద‌ని పేర్కొన్నారు. (తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ)

మరిన్ని వార్తలు