కేంద్రం తెచ్చిన నూతన చట్టంపై కోర్టులో పిటిషన్‌

28 Sep, 2020 19:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని ఆయన పిటిషన్‌లో తెలిపారు.  ఈ చట్టం చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎంపీ కోరారు. 

రైతుల కోసం ప్రత్యేక ట్రైబునల్‌ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ బిల్లులు అమలులోకి వస్తే రైతులు దోపిడికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ బిల్లుపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, ఈ బిల్లుకు రైతులకు మరణశిక్షలాంటిదని అన్నారు. పార్లమెంట్‌ లోపల బయట రైతుల గొంతు నొక్కేశారు అని మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై పంజాబ్‌ ముఖ్యమం‍త్రి అమరేందర్‌ సింగ్‌ కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేం‍ద్రమోదీ ఈ బిల్లు గురించి మాట్లాడుతూ, దీని ద్వారా రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకోడానికి మంచి ఫ్లాట్‌ఫాం దొరుకుందని, రైతుల మంచి కోసమే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు.   

చదవండి: కొనసాగుతున్న రైతుల రైల్‌రోకో

మరిన్ని వార్తలు