పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ!

6 Jul, 2022 15:57 IST|Sakshi

సాక్షి, చెన్నై: తన తండ్రి జ్ఞాపకంగా ఉంచుకున్న రూ.1.5 లక్షలు విలువ చేసే పెన్ను కనిపించడం లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. గత నెల 30న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా చెన్నైలో పర్యటించారు. ఆ సమయంలో విజయ్‌ మద్దతుదారులు గిండిలోని ఓ హోటల్‌ వద్ద హడావుడి సృష్టించారు. తమ నాయకుడికి బలం నిరూపించేలా విజయ్‌ను అభినందనలతో ముంచెత్తారు.

ఈ సమయంలో ఆయన జేబులో ఉన్న పెన్ను మాయమైంది. ఇంటికొచ్చిన తరువాత పెన్ను కనిపించక పోవడంతో ఆయన తీవ్ర మనో వేదనలో పడ్డారు. వెంటనే ఆ హోటల్‌కు వెళ్లారు. సమావేశం జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించారు. అక్కడి సిబ్బందిని పెన్ను గురించి ఆరా తీశారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం గిండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి జ్ఞాపకంగా ఉన్న పెన్ను కనిపించడం లేదని, దీని విలువ రూ.1.5 లక్షలుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పెన్ను బంగారంతో రూపొందించారని, పై భాగంలో వజ్రం కూడా ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు