-

సీఎంగానా? వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానా... కుదిరితే రెండునా!.. సందిగ్ధ స్థితిలో రాజస్తాన్‌ సీఎం

20 Sep, 2022 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్‌ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాం‍గ్రెస్‌ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. ఐతే అందుకు ఆశోక్‌ గెహ్లాట్‌ సిద్దంగా లేరని సమాచారం. పైగా పార్టీ అధ్యక్ష అత్యున్నత పదవిని రాహుల్‌ గాంధీనే చేపట్టాలని గెహ్లాట్‌ ఒప్పించే ప్రయత్నం చేయునున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా...రాజస్తాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కూడా ఢిల్లీకి రావడంతో ఆయనలో మరింత టెన్షన్‌ మొదలైంది. ఎందుకంటే ఈసారి రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలెట్‌కి చాన్స్‌ ఇవ్వాలని పార్టీ సన్నాహాలు చేయడం ఆశోక్‌ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వాస్తవానికి బీజేపీ ఆపరేషన్‌ కమలం తిరుగుబాటు సమర్థవంతంగా ఎదుర్కొన్న గొప్ప కాంగ్రెస్‌ అనుభవజ్ఞుడు ఆశోక్‌ గెహ్లాట్‌.

అందుకే పార్టీ ఆయన్ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తుంది. ఐతే ఆయన అందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఆయన అటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గానూ, రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగానూ రెండు పదవులలోనూ కొనసాగాలన్నదే ఆయన ఆలోచన అని పార్టీ సభ్యుల చెబుతున్నారు. తొలుత ఆశోక్‌ రాహుల్‌ని వర్కింగ్‌ ఛీప్‌గా ఉండేలా ఒప్పించేందుకు యత్నం చేసిన తదనంతరమే వచ్చే సోమవారం ఈ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్ల సమాచారం.

ఆయనకు ప్రత్యర్థిగా శశి థరూర్‌ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ ఈ నామినేషన్లను ఈ నెల సెప్టెంబర్‌ 30 వరకు స్వీకరిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే అక్టోబర్‌ 17 ఎ‍న్నికలు నిర్వహిస్తుంది లేదంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. 

(చదవండి: పంజాబ్‌ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానాయన శాఖ దర్యాప్తు)

మరిన్ని వార్తలు