మోదీజీ ఆ ఆస్కార్‌ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్‌ పంచ్‌

14 Mar, 2023 17:17 IST|Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆస్కార వేడుకల్లో భారత్‌ సాధించిన కీర్తిని గురించి కొనియాడారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. ఈ గెలుపు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే విజేతలు దక్షిణ బారతదేశానికి చెందిన వారంటూ హెలెట్‌ చేస్తూ చెప్పారు. ఐతే ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటునాటు పాట, చిన్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖర్గే మాట్లాడుతూ... దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కానీ నాదోక అభ్యర్థన అంటూ ఒక సైటిరికల్‌ పంచ్‌ విసిరారు. మోదీజీ దయచేసి ఈ ఆస్కార్‌ క్రెడిట్‌ని తీసుకోకండి అలా చేయకూడదు అన్నారు.

మోదీ తన గెలుపు కోసం.. మేమే దర్శకత్వం వహించాం, మేము రాశాం, అని చెప్పకూడదు ఇదే నా అభ్యర్థన అని ఖర్గే అన్నారు. అంతే ఒక్కసారిగా రాజ్యసభలో నవ్వులు విరబూశాయి. ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచే కాకుండా ట్రెజరీ బెంచ్‌ నుంచి కూడా నవ్వులు విరిశాయి. ఈ మేరకు రాజసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌, సభా నాయకుడు పీయూష్‌ గోయల్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవియా, కార్మిక మంత్రి భూపేందర్‌ యదవ్‌ తదితరులందరూ నవ్వుతూ కనిపించారు.

ఇదిలా ఉండగా, పియూష్‌ గోయల్‌ రాజసభ నామినేషన్ల గురించి ఆస్కార్‌ ఫర్‌ ప్రధానమంత్రి కార్యాలయం అనే పేరుతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అదికాస్తా ప్రధాన మంత్రి ఎంపిక ద్వారా రాజ్యసభ్యకు నామినేట్‌ అయిన వ్యక్తులకే ఆస్కార్‌ అవార్డు వచ్చిందన్నట్లు ఉండటంతో ఖర్గే ఇలా సైటరికల్‌గా వ్యాఖ్యానించారు. గోయల్‌ ఆ పోస్ట్‌లో విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులను ఎంపిక చేసి మరీ రాజ్యసభకు నామినేట్‌ చేయడంలో మోదీ తనదైన ముద్ర వేశారని అన్నారు. అంతేగాదు 2022లో ఎగువ సభకు నామినేట్‌ అయిన వారిలో ఆర్‌ఆర్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఉన్నారని ఆయన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు.

(చదవండి: క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు)

మరిన్ని వార్తలు