ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు

21 Jul, 2022 11:40 IST|Sakshi

ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌–ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలను కఠినతరం చేశారు. 

టీ కాంగ్రెస్‌ ర్యాలీకి పర్మిషన్‌
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనకు పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారు. నిబంధనలతో కూడా అనుమతి ఇవ్వడంతో టీ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయల్దేరడానికి సన్నద్ధమయ్యారు.. టీపీసీసీ చీఫ్‌ రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ మల్లు రవి, రోహిణ్‌రెడ్డి, విజయారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. వీరి నిరసన ర్యాలీ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకూ సాగనుంది.

 
 

మరిన్ని వార్తలు