వరదలపై సమీక్షా సమావేశం.. నిద్రపోయిన మంత్రి

6 Sep, 2022 17:38 IST|Sakshi

బెంగళూరు: అకాల వర్షాలతో బెంగళూరు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో వరద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐతే ఆ సమావేశంలో కర్ణాటక మంత్రి  ఆర్‌ ఆశోక్‌ నిద్రపోయారు.  ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.... విమర్శల దాడికి దిగింది. రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో మునిగిపోతుంటే.... మంత్రి నిద్రమత్తులో మునిగిపోతున్నారంటూ కామెంట్లు చేస్తూ...ట్వీట్‌ చేశారు.

వాస్తవానికి కర్ణాటక మంత్రి ఆశోక్‌ కుమార్‌ కూడా సోమవారం, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగిన వరద సమీక్ష సమావేశానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు జిల్లాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాదు ఆ సమావేశంలో బెంగళూరు ప్రజలను వరదల పరిస్థితి నంచి గట్టేక్కించేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందించే నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేయాలని సీఎం బొమ్మె నిర్ణయించినట్లు పేర్కొన్నారు కూడా.

(చదవండి: బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు)

మరిన్ని వార్తలు