ఈ ఫుడ్‌ ఎవరైనా తింటారా? వెక్కి వెక్కి ఏడ్చేసిన కానిస్టేబుల్‌

11 Aug, 2022 15:01 IST|Sakshi

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ రద్దీగా ఉండే రోడ్డు పైకి వచ్చి ఒకటే ఏడుపు. పోలీస్‌ మెస్‌లో భోజనం క్వాలిటీగా ఉంటుందనుకుంటారు. కానీ అదంతా అబద్ధం ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ భోజనం ప్లేట్‌ తీసుకువచ్చి మరీ చెప్పాడు.  అంతేకాదు ఆ ప్లేట్‌లోని చపాతీలు, అన్నం, పప్పు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి అంటూ ఏడూస్తూ పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న వారికి తన మనసులోని బాధను చెప్పకొచ్చాడు.

పైగా తాను ఈ విషయమై పై అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకులేదని చెబుతున్నాడు. అంతేకాదు ఇలా ఫిర్యాదుల చేస్తున్నందుకు తన ఉద్యోగం తొలగిస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. అదీగాక ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసుకు మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పారని అన్నాడు. అయినప్పటికీ పోలీస్‌ మెస్‌లో ఇలాంటి ఆహారమే తమకు అందిస్తోందని, పైగా ఈ ఆహారం తిని ఎక్కువ సేపు విధుల నిర్వర్తించలేమని వాపోయాడు.

ఈ ఆహారాన్ని జంతువుల కూడా తినవు అంటూ బోరు బోరున ఏడ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ విషయమై ఫిరోజాబాద్‌ పోలీస్‌ అధికారులు వెంటనే స్పందించి....సదరు కానిస్టేబుల్‌ పై విధులకు హాజరుకాకపోవడం, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు గతంలో 15 సార్టు పనిష్మెంట్‌ పొందిన చరిత్ర ఉందని  చెప్పుకొచ్చారు. అయిన ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. 

(చదవండి: స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు)
 

మరిన్ని వార్తలు