ఇంప్లాంట్‌ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ

25 Mar, 2022 05:03 IST|Sakshi

గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్‌ (మెటల్‌ ప్లేట్‌) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్‌ ప్లేట్‌ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్‌ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్‌ డిటెక్టర్‌ అలారం మోగింది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్‌ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం 

మరిన్ని వార్తలు