పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

26 Nov, 2021 11:37 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వం వహించారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. 

చదవండి: మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు
 

మరిన్ని వార్తలు