Delhi Heavy Rains: ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి

11 Sep, 2021 17:38 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలయింది. 18 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. 

భారీ వర్షాలకు ఢిల్లీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. మధు విహార్‌, జోర్‌బాగ్‌, మోతీబాగ్‌, ఆర్‌కేపురం, సదర్‌ బజార్‌ ప్రాంతాలు నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాణిఖేదాలోని అండర్‌పాస్‌ మొత్తం నీటితో మునిగిపోయింది. రేపు ఉదయం వరకు భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులతో సెప్టెంబర్‌ 16-17 తేదీల్లో కుంభవృష్టి కురుస్తుందని పేర్కొంది.

చదవండి: Covid-19: ‘ఎర్ర చీమల చట్నీ’ వాడాలని చెప్పలేం

మరిన్ని వార్తలు