కత్తి సరిపోలేదని ఖడ్గంతో కోశాడు.. దాంతో

23 Oct, 2020 17:42 IST|Sakshi

నాగ్‌పూర్‌ : పుట్టినరోజు వేడుక అంటే అందరితో కలిసి సంతోషంగా గడుపుతూ ఎంజాయ్‌ చేస్తారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమ పుట్టినరోజును మరిచిపోలేని మధురానుభూతిగా మలుచుకోవాలని అతిగా ప్రవర్తిస్తుంటారు. ఆ అతి ప్రవర్తనే వారిని అందరిముందు అబాసుపాలయ్యేలా చేస్తుంది.(చదవండి : బాణాసంచా పేలి ఐదుగురు సజీవ దహనం)

తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నిఖిల్‌ పటేల్‌ అక్టోబర్‌ 21న తన పుట్టినరోజు పురస్కరించుకొని అందరిని పిలిచి ఘనంగా వేడుకలు నిర్వహించాడు. పార్టీ మధ్యలో వచ్చిన నిఖిల్‌ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్‌ చేశారు. సాధారణంగా అయితే ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ నిఖిల్‌ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు. ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కేక్‌ను కట్‌ చేశాడు. నిఖిల్‌ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్‌ చేశారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలు పోలీసుల దృష్టిలో పడ్డాయి. వెంటనే నిఖిల్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు