లాలూ యాదవ్‌ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు

13 Jul, 2022 17:12 IST|Sakshi

పాట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ తన తండ్రి ఆరోగం కోసం ప్రార్థించేందుకు మధురకు వచ్చారు. ఐతే అతని విచిత్రమైన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. మధురలోని గిరిరాజ్ మహరాజ్ ఆలయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి లేదా దర్శనం చేసుకువాడానికి భక్తులను కాలినడకనే అనుమతిస్తారు. అదీగాక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో  వాహానాల ప్రవేశాన్ని నిషేధించారు.

ఐతే తేజ్‌ ప్రతాప్‌ తాను పరిక్రమ(ప్రదక్షిణ) చేయడానికి కారుతో దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తానంటూ విచిత్రంగా అభ్యర్థించాడు. పూర్ణిమ సందర్భంగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ణ్యా అధికారులు తేజ్‌ప్రతాపప్‌కి అనుమతి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన తేజ్‌ప్రతాప్‌ దేవాలంయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ తర్వాత తన కారుతో సహా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించేలా అధికారిక అనుమతి కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు కూడా.

ఐతే అక్కడ కూడా తేజ్‌ ప్రతాప్‌కి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ...ముదియ పూర్ణిమ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినందున, ప్రార్థనలు చేసేందుకైనా లేదా ప్రదక్షిణలు చేయడానికైన భక్తులను కాలినడకనే ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తాం. కానీ వాహనంతో సహా లోపలకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అదీగాక ఆలయ ప్రధాన ద్వారం వద్ద పరిక్రమ(ప్రదక్షిణ) నిర్వహించడం ఇక్కడ ఒక ప్రామాణిక ఆచారం, శ్రీకృష్ణుని భక్తులు దీన్ని పవిత్రంగా భావిస్తారు అని చెప్పారు. 

(చదవండి: నిలకడగా లాలూ ఆరోగ్యం.. పరామర్శించిన నితీశ్‌, ఫోన్‌లో ప్రధాని మోదీ ఆరా)

మరిన్ని వార్తలు