అదే ఊరిలో.. అదే రోజున.. మళ్లి పట్టాలు తప్పిన కోరమండల్

3 Jun, 2023 18:43 IST|Sakshi

సరిగ్గా 14 ఏళ్ల తర్వాత... 
కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. 14 ఏళ్ల  క్రితం కూడా ఇదే ఓడిశాలోని జాజ్ పూర్ వద్ద ఈ రైలు మొదటిసారి పట్టాలు తప్పింది. ఆసక్తికరమైన మరో సంగతేంటంటే ఆరోజు కూడా శుక్రవారమే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశాలోనే, శుక్రవారం రోజునే ప్రమాదానికి గురికావడం యాదృచ్చికం.  

2009, ఫిబ్రవరి 13, శుక్రవారం రోజున... 
ఒడిశాలోని జాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అత్యంత వేగంగా వెళ్తోన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరోజు ఆ ప్రమాదంలో స్లీపర్ క్లాస్ కు చెందిన 13 భోగీలు పట్టాలు తప్పగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు, 161 మంది గాయపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత అదే శుక్రవారం రోజున కోరమండల్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ ప్రమాదానికి గురికావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. 

కానీ ఇప్పుడు బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రమాదం అంతకంటే తీవ్రమైనది. రైలు ప్రమాదం తదనంతర పరిణామాలు మరింత విషాదకరంగా ఉన్నాయి.సంఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాల వద్ద రోదిస్తున్న బాధితులతో హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ సంఘటన కూడా ఒకటిగా మిగిలిపోతుంది. మృతుల సంఖ్య ఇప్పటికింకా ఒక కొలిక్కి రాలేదు. గాయపడినవారి సంఖ్య తగ్గుతుంటే.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అందరూ పాల్గొనండి

మరిన్ని వార్తలు