భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

27 Oct, 2020 10:08 IST|Sakshi

79 లక్షల 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

గడచిన 24 గంటలలో 36,470 పాజిటివ్ కేసులు

 దేశవ్యాప్తంగా 6,25,857 యాక్టివ్ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,46,000 దాటాయి. ఇదిలా వుండగా గడచిన 24 గంటలలో దేశంలో 36,470 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా  488 మంది మృతి చెందారు. అదేవిధంగా గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా63, 842 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  దేశవ్యాప్తంగా 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చికిత్స పొంది 72,01,070 మంది దేశ వ్యాప్తంగా డిశార్జ్‌ అయ్యారు.

ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా 1,19,502 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 90.62 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 7.88 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల సంఖ్య 1.50 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,58,116 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు మొత్తం 10,44,20,894 కరోనా టెస్ట్‌లు చేశారు.

చదవండి: కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

మరిన్ని వార్తలు