బాల్యం బడికి దూరం

5 Jun, 2022 09:08 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: అన్నెం పున్నెం ఎరుగని బాల్యంపై కరోనా భూతం పంజా విసిరింది. పాఠశాలల్లో అక్షరాలు నేరుస్తూ, ఆడుకోవాల్సిన చిన్నారులు పొలాల్లో, కార్ఖానాల్లో, దుకాణాల్లో పనివాళ్లుగా మారిపోయారు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ తమతో పాటు ఇంట్లో వారి ఆకలి తీరుస్తుందన్న ధ్యాసే తప్ప చదువుకోవాలన్న ఆశ వారికి దూరమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయినా.. విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయి.

కరోనా వల్ల గత రెండేళ్లుగా వేలాదిమంది బాలలు బడికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కుటుంబ పెద్దను కరోనా వైరస్‌ కబళించగా అనేక కుటుంబాలు దీనావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా మళ్లీ బడి ముఖం చూసే అదృష్టానికి వేలాది బాలలు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  

20 వేల మందిలో 35 శాతం మంది  

  • పిల్లల డ్రాపవుట్లపై ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ (నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే) చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  
  • చాలా మంది విద్యార్థులు తమకు చదువుపై ఆసక్తి లేదని చెప్పారట. 20 వేల మంది బాలురను సంప్రదించగా అందులో 35.7 శాతం మంది ఇదే మాట అన్నారు. 
  • బాధాకరమైన కారణాలు   
  • 21 వేల మంది బాలికలను ఈ ప్రశ్న అడగ్గా 21.4 శాతం మంది చదువు వద్దని చెప్పారు.

బాధాకరమైన కారణాలు

  • చదువుకునేందుకు పాఠశాలల్లో ఫీజులు చెల్లించేంత డబ్బు లేదు 
  • చదువుకు బదులు ఏదైనా పని చేసుకుంటే ఇల్లు గడుస్తుంది  
  • పాఠశాలలు దూర ప్రాంతాల్లో     ఉండడంతో వెళ్లలేని పరిస్థితి  
  • బాలికలకు సరైన వసతులు లేకపోవడంతో చదువంటే అనాసక్తి  
  • ప్రభుత్వ బడుల్లో సరైన బోధన లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించి చదవలేం

(చదవండి:  ‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు)

మరిన్ని వార్తలు