హంపీకి నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

17 Apr, 2021 22:01 IST|Sakshi

మే 15 వరకు స్మారకాల వీక్షకులకు బ్రేక్‌

సాక్షి, బళ్లారి: కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న హంపీలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. హంపీ స్మారకాలతో పాటు మహిమాన్వితుడైన విరూపాక్షేశ్వర స్వామి దర్శనాన్ని నిలుపుదల చేశారు. వచ్చే నెల 15 వరకు హంపీలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పురావస్తు శాఖాధికారులు శుక్రవారం తెలియజేశారు.
చదవండి: కరోనా ఆసుపత్రిలో వైద్యులు నృత్యం

మరిన్ని వార్తలు