కరోనా: భారత్‌లో 20 లక్షలు దాటిన కేసులు

7 Aug, 2020 10:10 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజులు గుడుస్తున్నకొద్దీ మునుపెన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో ​కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో వైరస్‌ కేసుల సంఖ్య గురువారం నాటికి 20 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో భారీ స్థాయిలో 62,538 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక్క రోజులో 60 వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది. కాగా రోజువారీ కేసుల విషయంలో ప్రస్తుతం అమెరికాను కూడా ఇండియా దాటేసింది. (తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు)

నిన్న ఒక్క రోజే 886 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు 41,585 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. 07గా ఉంది. దేశంలో ప్రస్తుతం 6,07,384 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 13,78,106 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. అయితే భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది. (కరోనా విలయం: ఒక్క రోజులో 2,000 మరణాలు)

మరిన్ని వార్తలు