Corona In India: కరోనా విజృంభణ.. ఎనిమిది వేలకు పైగా కొత్త కేసులు

12 Jun, 2022 10:24 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా.. మెల్లగా తన వ్యాప్తిని అంతకంతకూ  విస్తరిస్తూ పోతుంది. పరిస్థితులు సాధారణ స్థితిక వచ్చేసాయని ప్రజలు మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం తగ్గించేశారు. దీంతో మరోసారి భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో ఎనిమిది వేలకుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 8,582 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. శనివారం కోవిడ్‌తో 4  మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 2,922 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో ప్రస్తుతం 44,513 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  మొత్తం మరణాల సంఖ్య 5,24,761కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,435 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.  మొత్తం రికవరీల సంఖ్య 4,26,52,743గా ఉంది.
చదవండి: చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు

మరిన్ని వార్తలు