కరోనా డేంజర్‌: 24 గంటల్లో 1,45,384 కేసులు

10 Apr, 2021 10:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గతకొన్ని రోజులుగా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజూ లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1, 32,05,926కు చేరుకుంది. కాగా మొత్తం మరణాల సంఖ్య 1,68,436కి చేరుకుంది.

నిన్న కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం యాక్టివ్‌ సంఖ్య 10,46,631కి చేరుకుంది.  మొత్తం 9,80,75,160 వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,909 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 584 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,24,091కు పెరిగాయి. ఇప్పటివరకు 3,04,548 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, 1752 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఔ

చదవండి: కరోనా సెకండ్‌ వేవ్‌ : బ్యాంకులకు చిక్కులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు