భారత్‌: మరోసారి రెండు లక్షలకు దిగువన కరోనా కేసులు

28 May, 2021 10:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరల్‌ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి 2 లక్షలకు దిగువన రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా. కోవిడ్‌ మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటలలో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,660 మంది ప్రాణాలు విడిచారు. గురువారందేశ వ్యాప్తంగా 2,59,459 మంది డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కు పెరిగింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,18,895గా ఉంది. ప్రస్తుతం 23,43,152 యాక్టీవ్‌ కేసులున్నాయి. మొత్తం 2,48,93,410 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 90.34 శాతం రికవరీ రేటు ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 8.51 శాతంగా ఉంది. మరణాల రేటు 1.15 శాతంగా ఉంది.

చదవండి: ఫ్యాన్సీ మాస్క్‌లు వాడుతున్నారా..అయితే ప్రమాదం

మరిన్ని వార్తలు