కరోనా: 3.02కు తగ్గిన యాక్టివ్‌ కేసుల శాతం

21 Dec, 2020 10:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి 55వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 24,337 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,55,560కు చేరింది. ఆదివారం 333 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,810 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న 25,709 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 96,06,111 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,03,639 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 95.53గా ఉంది. మరణాల రేటు 1.45 శాతం ఉండగా.. యాక్టివ్‌ కేసుల శాతం 3.02కి తగ్గింది. చదవండి: యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం

మరిన్ని వార్తలు