భారత్‌: 89 లక్షలు దాటిన కరోనా కేసులు

18 Nov, 2020 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 89 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,617 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 474 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,12,907కు చేరగా.. మరణాల సంఖ్య 1,30,993కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ప్రస్తుతం 4,46,805యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. మంగళవారం 44,739 మంది కోలుకోగా ఇప్పటి వరకు 83,35,109 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.52 గా ఉంది. మరణాల శాతం 1.47కు తగ్గింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 5.01 శాతంగా ఉంది. చదవండి: రోజుకు ‘లక్ష’ పరీక్షలే లక్ష్యం..!

మరిన్ని వార్తలు