Corona: కొత్త కేసుల్లో మరోసారి పెరుగుదల

14 Jul, 2021 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్‌తో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు కొంచెం అదుపులోకి వస్తున్నాయి. మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటితో పోలీస్తే బుధవారం మరోసారి కేసులు పెగిగాయి. గత 24 గంటల్లో 38,792 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 624 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది. ఇప్పటి వరకు 4,11,408 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ బుధవారం కోవిడ్‌పై హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం ఇప్పటి వరకు 3,01,04,720 కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. నిన్న41వేల మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,29,946 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 38.76 కోట్లకు పైగా టీకా తీసుకున్నారు.

మరిన్ని వార్తలు