‘అమ్మా నేనొస్తా’.. తల్లి మరణించిన కొన్ని గంటలకే

12 May, 2021 11:39 IST|Sakshi
(ప్రతీకాత్మక చిత్రం)

మండ్య: కరోనా సోకి తల్లి మరణిస్తే, ఆ వ్యథతో కుమారుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన కర్నాటకలోని మండ్య నగరంలో జరిగింది. సుభాష్‌నగరకు చెందిన సుజాతకు ఈనెల 7వ తేదీన కరోనా లక్షణాలు రావడంతో కుమారుడు సీఎన్‌ రమేశ్‌ కీలార కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ ఈనెల 9వ తేదీన రాత్రి తుదిశ్వాస విడిచింది.

కరోనాతో మృతి చెందడంతో కుమారుడికి తల్లి కడసారి చూపు దక్కలేదు. అతడు లేకుండా ఆరోగ్య సిబ్బంది అంత్యక్రియలు జరిపించారు. ఈ పరిణామాలతో కుమారుడు కృంగిపోయాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ కొన్నిగంటలకే ఇంట్లో గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చు.

చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య
చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు