Corona Alert: ఫోర్త్‌ వేవ్‌ ఎఫెక్ట్‌.. 45 శాతం పెరిగిన పాజిటివ్‌ కేసులు

27 Jun, 2022 11:48 IST|Sakshi

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్‌ వేవ్‌ ఎఫెక్ట్‌తో దేశంలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్‌ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. 

ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్‌ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ‍్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్‌ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్‌ 24న, మళ్లీ సోమవారమే(జూన్‌ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్‌ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి: దావత్‌లు ఇవ్వరు.. డీజే, బారాత్‌లు బంద్‌.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!!

మరిన్ని వార్తలు