India Covid Fourth Wave Effect: భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

30 Jun, 2022 10:37 IST|Sakshi

Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటింది. 

ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్‌ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. 

ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటడం ఇదే రెండోసారి. కాగా, ఫిబ్రవరి 28న దేశంలో 1,02,601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ జూన్‌ 30(నేడు)వ తేదీన ఆ మార్కు దాటి యాక్టివ్‌ కేసులు పెరిగాయి.

మరిన్ని వార్తలు